వెంకటగిరి, ఆదర్శ పాఠశాలలో
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశానికి ఆహ్వానం
తిరుపతి జిల్లా మండల కేంద్రమయిన వెంకటగిరి ఆదర్శ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్ధినీ విద్యార్థులను చేర్చుకొనుటకు ఈ నెల 17 నుండి ఆన్ లైన్ ద్వారా దరకాస్తులు ఆహ్వానిస్తున్నాము. ఆ.ప్ర. పాఠశాల విద్య కమీషనర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల మోడల్ స్కూళ్లతో పాటు వెంకటగిరిలోని మోడల్స్ స్కూల్ నందు కూడా ఇంటర్ మొదటి సంవత్సరంలో విద్యార్థులకు అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఈనెల 17వ తేదీ నుండి మీ 22వ తేదీ లోగా ఆన్ లైన్లో దరకాస్తు చేసుకోవాలి. ఆదర్శ పాఠశాలలో బోధనా మాధ్యమం ఆంగ్లంలో ఉంటుంది. . ఈ పాఠశాలలో విద్యనభ్యసించుటకు ఎలాంటి ఫీజులు వసూలుచేయబడవు. వెంకటగిరి మండల పరిసర ప్రాంతాలలో 2024-25 విద్యా సంవత్సరం పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్ధినీ విద్యార్థులు మాత్రమే దరకాస్తు చేసుకోవాలి. ఈ పాఠశాలలో యం.పీ సి., బై పిసి, ఎం ఇ సి., సిఇసి కోర్సులు కలవు. ప్రతి గ్రూపుకు 40 సీట్లు కేటాయించడమైనది.
విద్యార్థులు తమ దరఖాస్తులను 2025 మే 22వ తేదీ లోగా ఏదేని ఆన్లైన్ కేంద్రంలో www. apms.apcfss.in వెబ్సైట్లో ప్రవేశ రుసుముతో దరకాస్తు చేసుకోవాలి.

దరకాస్తు చేసుకోవడానికి ఓసి, బిసి మరియు ఇడబ్ల్యూఎస్ లకు చెందిన వారు 200 రూపాయలు, ఎస్ సి, ఎస్ టి కులమునకు చెందిన వారు 150 రూపాయలు ఆన్ లైన్లో / నెట్ బ్యాంకింగ్/ క్రిడిట్,డిబిట్ కార్డుల లను ఉపయోగించి గేట్ వే ద్వారా ప్రవేశ రుసుము చెల్లించాలి.
దరఖాస్తు చేసుకొన్న విద్యార్థులు ఆన్లైన్ కాపీతో పాటు స్టడీ సర్టిఫికెట్, ఆధార్ జిరాక్స్, కుల ధ్రువీకరణ పత్రం, పాస్ ఫొటోతో స్థానిక మోడల్ స్కూల్లో అందజేయాలి.
విద్యార్థుల ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్ ప్రకారం ఆదర్శ పాఠశాలకు కేటాయించిన ప్రతి గ్రూపుకు 40 సీట్లు చొప్పున విద్యార్థినీ విద్యార్థులు ఇవ్వబడును. విద్యార్థుల ఎంపిక జాబితాను మోడల్ స్కూల్ లో 26-05-2025 తేదీ నోటిఫికేషన్ బోర్డులో ప్రకటించబడును.
వెంకటగిరి మోడల్ స్కూలుకు సంబంధించిన వెబ్ సైటు www.apmsvenkatagiri.com ను కూడా తిలకించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
ఇతర వివరాలకు తమ పాఠశాలలో సంప్రదించవచ్చు

ఆదర్శ పాఠశాలలో విద్యనభ్యసించుటకు పలు సదుపాయాలున్నాయి. ఇక్కడ ఎలాంటి ఫీజులు వసూలుచేయబడవు. ప్రవేటు పాఠశాలకు మించి, మిగతా పాఠశాలకు దీటుగా ప్రతిభావంతులైన, పి.హెచ్.డి., ఎం.ఫీల్., నెట్ & స్లేట్లలో ఉన్నత విద్యార్హత కలిగిన ఉత్తమ ఉపాధ్యాయులచే పిల్లలకు గుణాత్మకమైన విద్యను అందిస్తాం. మోడల్ స్కూల్ లో ఆంగ్ల బోధనతో పాటు అనేక పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ, స్కాలర్ షిప్పుకు అవకాశం, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత యూనిఫామ్ దుస్తులు, డిజిటల్ క్లాసులు, స్పెషల్ క్లాసులు, అత్యాధునిక సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ క్లాసులు, లైబ్రరీ, ప్లే గ్రౌండ్, మధ్యాహ్న భోజనం పథకం, ఆరో ప్లాంట్ వాటర్ వంటి ప్రత్యేక సౌకర్యములుంటాయని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాం. ఇక్కడ ప్రత్యేక బోధన సిబ్బందితో వృత్తి విద్య కోర్సులు కూడా నిర్వహిస్తున్నాం.
ఇక్కడ ప్రశాంత వాతావరణంలో కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ఆధునిక వసతులతో నూరు శాతం ఉత్తమ ఫలితాలను సాధించేలా విలువలతో కూడిన ఉన్నత విద్యను 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉచితంగా అందించడమే ఆదర్శ పాఠశాల ప్రధాన లక్ష్యం. పలు ప్రతిభా అవార్డులతో ఉత్తమ ఫలితాలను సాధించిన ఘనత వెంకటగిరి ఆదర్శ పాఠశాలకు ఉంది. వెంకటగిరి పరిసర గ్రామీణ ప్రాంతవాసులు ఇక్కడి ఆదర్శ పాఠశాల విద్యా సదుపాయాలను వినియోగించుకోవాలని కోరుతున్నాం.
డి. తులసి జ్యోతి,
ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయ, సిబ్బంది.
ఎ. పి. మోడల్ స్కూల్, వెంకటగిరి.
ఫోన్ : 83330 66000
