వెంకటగిరి, ఆదర్శ పాఠశాలలో
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశానికి ఆహ్వానం

తిరుపతి జిల్లా మండల కేంద్రమయిన వెంకటగిరి ఆదర్శ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్ధినీ విద్యార్థులను చేర్చుకొనుటకు దరకాస్తులు ఆహ్వానిస్తున్నాము. ఆ.ప్ర. పాఠశాల విద్య కమీషనర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల మోడల్ స్కూళ్లతో పాటు వెంకటగిరిలోని మోడల్స్ స్కూల్ నందు కూడా ఇంటర్ మొదటి సంవత్సరంలో విద్యార్థులకు అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఈనెల 17వ తేదీ నుండి మీ 22వ తేదీ లోగా ఆన్ లైన్లో దరకాస్తు చేసుకోవాలి. ఆదర్శ పాఠశాలలో బోధనా మాధ్యమం ఆంగ్లంలో ఉంటుంది. . ఈ పాఠశాలలో విద్యనభ్యసించుటకు ఎలాంటి ఫీజులు వసూలుచేయబడవు. వెంకటగిరి మండల పరిసర ప్రాంతాలలో 2024-25 విద్యా సంవత్సరం పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్ధినీ విద్యార్థులు మాత్రమే దరకాస్తు చేసుకోవాలి. ఈ పాఠశాలలో యం.పీ సి., బై పిసి, ఎం ఇ సి., సిఇసి కోర్సులు కలవు. ప్రతి గ్రూపుకు 40 సీట్లు కేటాయించడమైనది.

దరకాస్తు చేసుకోవడానికి ఓసి, బిసి మరియు ఇడబ్ల్యూఎస్ లకు చెందిన వారు 200 రూపాయలు, ఎస్ సి, ఎస్ టి కులమునకు చెందిన వారు 150 రూపాయలు ప్రవేశ రుసుము చెల్లించాలి.
దరఖాస్తు చేసుకొన్న విద్యార్థులు దరకాస్తులుతో పాటు స్టడీ సర్టిఫికెట్, ఆధార్ జిరాక్స్, కుల ధ్రువీకరణ పత్రం, పాస్ ఫొటోతో మోడల్ స్కూల్లో అందజేయాలి.

విద్యార్థుల ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్ ప్రకారం ఆదర్శ పాఠశాలకు కేటాయించిన ప్రతి గ్రూపుకు 40 సీట్లు చొప్పున విద్యార్థినీ విద్యార్థులు ఇవ్వబడును. విద్యార్థుల ఎంపిక జాబితాను మోడల్ స్కూల్లో నోటిఫికేషన్ బోర్డులో ప్రకటించబడును.
వెంకటగిరి మోడల్ స్కూలుకు సంబంధించిన వెబ్ సైటు www.apmsvenkatagiri.com ను కూడా తిలకించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
ఇతర వివరాలకు తమ పాఠశాలలో సంప్రదించవచ్చు