
వెంకటగిరి, ఆదర్శ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరం ఆరోన్ తరగతి ప్రవేశానికి అర్హత పరీక్ష దరఖాస్తులకు ఆహ్వానం

తిరుపతి జిల్లా నియోజకవర్గ కేంద్రమయిన వెంకటగిరి ఆదర్శ పాఠశాలనందు 2026 - 27 విద్యాసంవత్సరానికి 6వ తరగతిలో విద్యార్ధినీ విద్యార్థులను చేర్చుకొనుటకు ప్రవేశ పరీక్షకు గాను ఈనెల 23వ తేదీ నుండి ఆన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు ఎపి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డి.తులసి జ్యోతి తెలిపారు.
ఆన్లైన్ లో మార్చి 31వ తేదీ లోగా ప్రవేశ రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వెంకటగిరి మోడల్ స్కూలులో ఏప్రిల్ 12వతేది ప్రవేశ పరీక్ష నిర్వహించబడతాయని. ప్రవేశ పరీక్షకు సంబంధించి ఫలితాలను, మెరిట్ లిస్టును ఏప్రిల్ 27న విడుదల చేసి, పూర్తి ఎంపిక జాబితాను అదే రోజు ప్రకటిస్తామని తులసి జ్యోతి తెలిపారు.

ఎంపికయిన విద్యార్థినీ విద్యార్థులు 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం నుండే మోడల్ స్కూల్ తరగతులకు హాజరు కావాలి.
ఆ.ప్ర.పాఠశాల విద్య కమీషనర్ గారి ఆదేశాల మేరకు వెంకటగిరి మోడల్స్ స్కూల్ నందు ఈ ప్రవేశార్హత పరీక్షలు జరుపుతున్నాము. ప్రవేశ పరీక్ష 5వ తరగతి స్థాయిలో తెలుగు/ఇంగ్లీషు మీడియంలో నిర్వహించబడుతుందని, పాఠశాలలో బోధనా మాధ్యమం మాత్రం ఆంగ్లంలోనే ఉంటుందని తెలిపారు.
ఈ పాఠశాలలో విద్యనభ్యసించుటకు ఎలాంటి ఫీజులు వసూలుచేయబడవని, మండల పరిసర ప్రాంతాల పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరం నాల్గవ తరగతి పూర్తిచేసి, ఈ విద్యాసంవత్సరం 5వ తరగతి చదువుతున్న విద్యార్ధినీ విద్యార్థులు మాత్రమే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్షకు ఆన్ లైన్లో www.cse.ap.gov.in లేదా apms.ap.gov.in వెబ్సైట్లో ప్రవేశ రుసుముతో దరఖాస్తు చేసుకొని, అనంతరం దరఖాస్తు ఆన్లైన్ కాపీని , స్టడీ సర్టిఫికెట్, నివాస, కుల ధృవీకరణ పత్రంతో పాటు పాస్ ఫొటోలను జతచెసి మోడల్ స్కూల్లో అందజేయాలి. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా, రిజర్వేషన్స్ ప్రకారం సీట్లు కేటాయిస్తామని తెలిపారు. ఇతర వివరాలకు మోడల్ స్కూల్లో పని వేళలందు సంప్రదించాలని ఆమె తెలిపారు.
🙏
- ఉత్తమ ఫలితాలే ‘ఆదర్శ పాఠశాల’ లక్ష్యం**
📖
ఆదర్శ పాఠశాలలో విద్యనభ్యసించుటకు పలు సదుపాయాలున్నాయి. ఇక్కడ ఎలాంటి ఫీజులు వసూలుచేయబడవు . ప్రవేటు పాఠశాలకు మించి, మిగతా పాఠశాలకు దీటుగా ప్రతిభావంతులైన, పి.హెచ్.డి., ఎం.ఫీల్., నెట్ & స్లేట్లలో ఉన్నత విద్యార్హత కలిగిన ఉత్తమ ఉపాధ్యాయులచే గ్రామీణ విద్యార్ధులకు గుణాత్మకమైన విద్యను ఆదర్శ పాఠశాలల్లో అందిస్తున్నాము.
మోడల్ స్కూల్ లో ఆంగ్ల బోధనతో పాటు అనేక పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ, స్కాలర్ షిప్పుకు అవకాశం, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత యూనిఫామ్ దుస్తులు, అత్యాధునిక విద్య, డిజిటల్ క్లాసులు, స్టడీ అవర్స్, స్పెషల్ క్లాసులు, విశాలమైన తరగతి గదులు, అత్యాధునిక సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ క్లాసులు, లైబ్రరీ, ప్లే గ్రౌండ్, మధ్యాహ్న భోజనం పథకం, ఆరో ప్లాంట్ వాటర్ వంటి ప్రత్యేక సౌకర్యములున్నాయి. . పిల్లలపై మానసిక ఒత్తిడి పడకుండా విజ్ఞానదాయకంగా, వినోదాత్మకంగా సహపాఠ్య చర్యలు కో-కరికులర్ యాక్టివిటీస్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇవి పిల్లల్లో దాగివున్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి దోహద పడుతున్నాయి. ఇక్కడ 9 వతరగతి నుంచి ప్రారంభమై ఇంటర్మీడియట్ వరకు నాలుగేళ్ళ పాటు ప్రత్యేక బోధన సిబ్బందితో వృత్తి విద్య కోర్సులు కూడా నిర్వహిస్తున్నాము. ఇక్కడ ప్రశాంత వాతావరణంలో కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ఆధునిక వసతులతో నూరు శాతం ఉత్తమ ఫలితాలను సాధించేలా విలువలతో కూడిన ఉన్నత విద్యను 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉచితంగా అందించడమే ఆదర్శ పాఠశాల ప్రధానక్ష్యం. గత 12 ఏళ్లుగా పలు ప్రతిభా అవార్డులతో ఉత్తమ ఫలితాలను సాధించిన ఘనత వెంకటగిరి ఆదర్శ పాఠశాలకు ఉంది. వెంకటగిరి మండల పరిసర గ్రామీణ ప్రాంతవాసులు ఇక్కడి విద్యా సదుపాయాలను వినియోగించుకోవాలి. ఇతర వివరాలకు పాఠశాల పనివేళల్లో 8333066000 నంబరును సంప్రదించాలి. మరిన్ని వివరాలకు www.apmsvenkatagiri.com వెబ్ సైటు ను వీక్షించాలని కోరుతున్నాం. - డి. తులసి జ్యోతి .
ప్రిన్సిపాల్, ఎపి మోడల్ స్కూల్, వెంకటగిరి




















