జూన్ 24న వెంకటగిరి
ఏపి మోడల్ స్కూల్
7,8,9వ తరగతుల ప్రవేశ పరీక్ష
📖
2025-26 విద్యా సంవత్సరానికి వెంకటగిరిలోని ఏపీ మోడల్ స్కూలులో 7, 8 మరియు 9వ తరగతిలో ప్రవేశానికి ఈ నెల 24 మంగళవారం ఉదయం 10 గం. లకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ డి. తులసి జ్యోతి తెలిపారు. శనివారం విలేఖరులతో మాట్లాడుతూ
పాఠశాల విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు ఈ పాఠశాలలో 7,8,9వ తరగతుల్లో ఈ విద్యా సంవత్సరంలోని ఖాళీ సీట్లను భర్తీ చేయడానికి ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ఆయా తరగతుల ప్రవేశానికి
అర్హత కలిగిన విద్యార్థినీ విద్యార్థులు ఈ నెల 10 నుండి 20వ తేది లోగా పాఠశాలలో గానీ ఆన్లైన్లో గానీ ప్రవేశ రుసుము చెల్లించి
దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ప్రవేశ పరీక్ష ఫలితాలను ఈ నెల 25న ప్రకటిస్తామని, 26న అడ్మిషన్స్ స్వీకరిస్తామని ఆమె తెలిపారు.
ఇతర వివరాలకు పాఠశాల పనివేళల్లో సంప్రదించాలని తులసి జ్యోతి తెలిపారు.
🙏

Oplus_16777216
Oplus_16777216
Oplus_16777216