ఉత్తమ ఫలితాలు సాధించిన మోడల్ స్కూల్ విద్యార్థులు
📖


2025 విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో వెంకటగిరి, ఏపి మోడల్ స్కూల్ విద్యార్థులు 85.04 శాతం ఉత్తీర్ణత సాధించారు.
బోయిలపల్లి హనుమంతు అనే విద్యార్థి 600 మార్కులకు 580 మార్కులతో పాఠశాల స్థాయిలో ప్రధమంగా నిలచారు.

దిషికా రాణి 570, ఆయిల జ్యోషిక 565 మార్కులు సాధించి ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.


96 మంది పరీక్షలు రాయగా 67 మంది ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. 26 మంది 500లకు పైబడి మార్కులు సాధించారు.