ప్రతిభ, ప్రగతి ఫలితాలు వెరసి
వెంకటగిరి ఆదర్శ పాఠశాల
విద్యార్థులు, తల్లిదండ్రుల్లో పెరుగుతున్న ఆసక్తి , నమ్మకం

అడ్మిన్ల కోసం భారీగా ధరకాస్తులు

నేటి ఆధునిక పోటీ ప్రపంచంలో అభివృద్ధి ఫలాలను అందుకోవడానికి ఆంగ్ల భాషా పరిజ్ఞానం ప్రధాన సాధనంగా మారింది. మారుతున్న కాలంతో మాతృభాషతో పాటు ఆంగ్లభాష అవసరంగానూ, ఆకర్షణగానూ మారింది. 

ఈ నేపథ్యంలో వెనుకబడిన ప్రాంతాల విద్యార్థినీ విద్యార్థుల చెంతకు ఆంగ్ల మధ్యమ విద్యను అందించాలన్న ఆశయంతో ఆంధ్రప్రదేశ్లో 164 ఆదర్శ పాఠశాలలు స్థాపించబడ్డాయి.
ఈ ఆదర్శపాఠశాలల్లో పేరెన్నిగన్నదీ, ప్రగతిపథంలో నిలచిందీ, ప్రతిభా పాటవాలను చాటుకొన్నదీ, ఉత్తమ ఫలితాలను సాధించగలిగింది వెంకటగిరి ఆదర్శపాఠశాల. అదే ఎపి మోడల్ స్కూల్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలో వున్నప్పుడు 2013విద్యా సంవత్సరంలో ప్రారంభమైన ఈ మోడల్ స్కూల్ నేడు తిరుపతి జిల్లాలో చేరి 2024-25 ఈ విద్యాసంవత్సరంలో ఒక పుష్కర కాలం పూర్తి చేసుకొన్నది. 12 వసంతాలు పరిపూర్ణ ఫలితాలతో పూర్తి చేసుకొని 2025-26 విద్యా వత్సరంలో 13వ వసంతలోకి అడుగిడుతోంది.


ఈ మోడల్ స్కూల్లో ఉత్తమ ఫలితాలను సాధించడం, క్రమశిక్షణకు మారుపేరుగా నిలబడటం, కార్పొరేట్ పాఠశాలలకు మించి అత్యాధునిక సౌకర్యాలతో అనుభవం, అంకిత భావంతో నాణ్యమైన విద్యను అందించడంలో సంచలనంగా మారింది. అభివృద్ధి బాటలో ప్రభంజనం సృష్టిస్తుంది.
ఇక్కడ చదివే ప్రతి విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు పునాది కావాలనే లక్ష్యంతో పకడ్భందిగా నిర్వహించడంతో తమ పిల్లలను ఈ మోడల్ స్కూల్లో చదివించడానికి తల్లిదండ్రులు పెక్కు ఆసక్తిని కనబరుస్తున్నారు. భారీగా ధరకాస్తులు చేసుకొంటున్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశానికి ప్రకటన వెలువడింది. మార్చి 31 వరకు ఆన్లైన్లో ధరకాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ ఏడాది అడ్మిషన్ల కోసం
అంచనాలకు మించి భారీగా ధరకాస్తులు చేసుకోవటం ఇందుకు నిదర్శనం.

నాణ్యమైన విద్య

 ప్రవేట్  స్కూళ్ళు , కార్పొరేట్ స్కూళ్లకు మించి ఈ మోడల్ స్కూల్లో నాణ్యమైన విద్య బోధన జరుగుతుంది. ఇక్కడి విద్యార్థులకు ఎం. ఏ. ఎం.ఇడి., బి. ఇడి., పి. హెచ్ డి., ఎం.పిల్స్  చేసిన అనుభవజనులైన ఆధ్యాపకులతో విద్యా బోధన సాగుతుంది.  పీజీటీలు, టీజీటీలు, నెట్ అండ్ స్లెట్ లలో అర్హత పొందిన వారు బోధనా  రంగంలో పనిచేస్తున్నారు. 

చక్కని భవనములు, మౌళిక సదుపాయాలు కలిగి అత్యాధునిక వసతులతో విలువలతో కూడిన విద్యను ఆరో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఆంగ్ల మాధ్యమంలోనే విద్యనందిస్తున్నారు.

ఆధునిక విద్య

   ఆధునిక పద్దతిలో విద్యనందించడానికి ఇక్కడి విద్యార్థులకు టాబ్స్ అందించి  మంచి ఫలితాలను సాధిస్తున్నారు. అలాగే ఐ. ఎఫ్.పి ప్యానల్స్   ప్రతి  తరగతి గదిలో అమర్చి సాంకేతిక విద్యా ప్రమాణాలతో ఆధునిక విద్యను అందిస్తున్నారు. విద్యార్థులు కష్టంగా భావించే భాష పట్ల మమేకం, ప్రేమ కలిగేలా మొదట బ్రిడ్జి కోర్సును, స్పోకన్ ఇంగ్లేష్ తరగతులను నిర్వహించి విద్యార్థులందరూ  ఇంగ్లీషులో సులభంగా  మాట్లాడేలా కృషి చేస్తుంది.

సీట్లు కేటాయింపు

     ఉచితంగా విద్యను అందించటమే తప్ప ఎలాంటి ఫీజులు వసూలు చేయబడవు. ప్రతి విద్యా సంవత్సరం మొదలు కాబోయే ముందు ఆరో తరగతి ప్రవేశార్హత  పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి  రిజర్వేషన్ల ప్రకారం సీట్లు  కేటాయించబడును.  6 నుండి 10  వరకు ప్రతి  తరగతిలో  రెండు విభాగాలుగా 50 మంది చొప్పున ఎ సెక్షన్, బి సెక్షన్లగా 100 సీట్లు కలిగి ఉంటాయి. 
      ఇంటర్మీడియట్ లో మాత్రం యం.పి. సి., బైపీసీ, ఎం.ఇసీ, సి.ఇసీ లలో  ఒక్కో కోర్సుకు 40 సీట్లు కలిగి ఉంటాయి.  ఈ సిటీల కొరకు ఆన్లైన్ లోనే దరకాస్తు చేసుకోవాలి.  వేసవి సెలవులు గడచి పాఠశాల పునః ప్రారంభమైన  మొదటి వారంలో 7వ తరగతి నుండి 9 వరకు ఖాళీగా వున్న  సీట్లను అర్హతలనుబట్టి భర్తీ జరుగుతుంది. ఉత్తమ ఫలితాలను సాధించడానికి ఇక్కడ విద్యనభ్యసించే ప్రతి విద్యార్థిపై  ప్రత్యేక శ్రద్ధ వహించటంతో పాటు ఎం సెట్, ట్రిబుల్  ఐఐటీ, మెడికల్ సీట్లు పొందడానికి అవసరమైన ప్రత్యేక శిక్షణ ఇస్తారు. విద్యార్థుల మానసిక అంతరాలలో వున్న ఆలోచనలను గమనించి వారికి  అనుగుణంగా విద్యా ప్రమాణాలను పెంపొందించి ఉజ్వల భవిష్యత్తు వైపు  నడిపిస్తారు.

అత్యాధునిక ప్రయోగశాలలు

ఆధునిక విద్యను అందించడానికి ఇక్కడ అత్యాధునిక ప్రయోగశాలలు ఏర్పాటుచేయబడ్డాయి. ఫిజిగ్స్ లాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, బయాలజీ ల్యాబ్, స్టెమ్ ల్యాబ్, పాల్ ల్యాబ్, ఎన్ టి ఎస్ ఐ ఇ లాబులు వేరు వేరుగా కలిగివున్నాయి. విస్తృత ప్రయోగాలకు వీలుగా ఆధునిక సౌకర్యాలతో ఆయా సబ్జక్టులకు సంబంధించిన అనుభవజ్ఞులైన పీజీటీలతో విద్యార్థుల్లో వున్నా నైపుణ్యాన్ని వెలికితీయసేలా శిక్షణ ఇస్తారు. జిల్లా రాష్ట్ర స్థాయి పరిశోధనా పురస్కారాలకు అర్హులుగా తీర్చిదిద్దుతారు.

ఒకేషనల్ కోర్సులు

కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలనుకునే అభ్యర్థులకు ఒకేషనల్ కోర్సు వరం లాంటిది. ఇంజనీరింగ్, బ్యాంకింగ్, అకౌంటెన్సీ, నర్సింగ్, మెడిసిన్, ఆర్కిటెక్చర్, ఫార్మసీ, లా, IT- ITES సంబందించినవి, చేతి వృత్తి పనులు బ్యూటీషియన్లు, కుట్టు పనులు, అల్లికలు, టైలరింగ్, చెఫ్‌లు లాంటివి ఒకేషనల్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. నైపుణ్యం ఆధారంగా త్వరితగతిన ఉద్యోగం పొందాలనుకునే వారికి ఉపయోగపడతాయి. ఇక్కడ ఒకేషనల్ కోర్సులలో శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేకంగా నిష్ణాతులైన ట్రైనర్స్ ఇద్దరున్నారు. ఈ కోర్సులు 6,7, 8 వ తరగతులకు మాత్రమే పరిమితం.

కంప్యూటర్ కోర్సు

ఇక్కడ చదివే 6, 7, 8 వ తరగతుల నుండే కంప్యూటర్స్ పట్ల అవగాహన కల్పిస్తూ శిక్షణ ఇస్తారు. ఇందుకు గాను ప్రత్యేకంగా ఒక కంప్యూటర్ టీచర్ వున్నారు. అత్యంత ప్రాథమిక దీర్ఘకాలిక కోర్సులలో కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్ మరియు కంప్యూటర్ ఇంజనీరింగ్ , కంప్యూటర్ సైన్స్ కోర్సులకు దోహదపడేలా మొదట్లోనే ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ , పవర్ పాయింట్ లాంటి బేసిక్స్ నేర్పిస్తారు. అందుకుగాను ప్రత్యేకంగా ఒక కంప్యూటర్ లాబ్, విద్యార్థులకు అవసరమైన సిస్టమ్స్, లాప్టాప్స్, టాబులు కలిగివున్నాయి.

లైబ్రరీ

పిల్లలకు అవసరమైన అన్ని రకాల పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను ఎప్పటికప్పుడు తాజాగా సేకరించి పిల్లల ముందుంచుతారు. ప్రత్యేకంగా ఒక లైబ్రరిన్ అందుబాటులో వుంటారు. పోటీ పరీక్షలకు విద్యార్థులు వ్యక్తిగతంగా వేలకు వేలు వెచ్చించి కొనాల్సిన అవసరంలేదు. మెడికల్, ఇంజనీరింగ్ అర్హత పరీక్షలకు, నీట్, జె ఇ ఇ, ఐ ఐ టి, ఎంసెట్ శిక్షణకు అవసరమైన వివిధ ప్రచురణ సంస్థలకు సంబంధించిన పుస్తకాలను పాఠశాల గ్రంధాలయంలో అందుబాటులో ఉంచటమే కాకుండా అందుకు అవసరమైన శిక్షణ కూడా ఇస్తారు.

భారత స్కౌట్స్ & గైడ్సు

బాల బాలికలలో దేశభక్తిని, క్రమశిక్షణను పెంపొందించి వారిని సమాజ సేవకులుగా తీర్చిదిద్దడానికి బాలలను స్కౌట్స్ గా, బాలికలను గైడ్సు గా 6వతరగతి నుండి తీర్చిదిద్దుతారు. ప్రతి ఏడాది పాఠశాల మొదలు కాగానే 6వతరగతిలో 30 మంది బాలలను, 30 మంది బాలికలను ఉత్సాహం, నేర్పరితనం, అర్హతలను బట్టి ఎంపికచేసుకొంటారు. వీరు 8వతరగతి వరకు కొనసాగుతారు. వీరికి ఉచిత యూనిఫామ్ దుస్తులు అందజేస్తారు. ప్రతి సంవత్సరం క్యాంపులు కూడా ఉంటాయి. స్కౌట్స్ & గైడ్సు యందు ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులున్నారు.

సైనిక శిక్షణకు ఎన్ సి సి

విద్యార్థులల్లో సహృదయం, శారీరిక దారుఢ్యం, క్రమ శిక్షణ, సామాజిక అంకిత భావం, కర్తవ్య నిర్వహణ, నాయకత్వం, లౌకిక దృక్పథం, సాహస స్ఫూర్తి మరియు నిస్వార్థ సేవ, దేశ భక్తి కలిగించేలా నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ( ఎన్ సి సి) ని ఇక్కడ ఏర్పాటు చేయడమైనది.
ప్రతి ఏడాది ఇక్కడ 8వతరగతిలో చదివే బాల బాలికలను కలిపి 50 మంది చొప్పున అర్హతలను బట్టి ఎంపిక చేసుకొని 9వతరగతి వరకు రెండేళ్లపాటు సైనిక శిక్షణ ఇస్తారు. ఉన్నత విద్య, ఉద్యోగాలకు ఉపాయోగపడేలా ఎ సర్టిఫిఒకేట్స్ కూడా ఇస్తారు. శిక్షణ పొందిన ఒక ఉపాధ్యాయుడు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. ప్రత్యేక సందర్భాలలో పోలీసులు చేసే విధినిర్వహణకు కూడా ఎన్ సి సి పిల్లలను క్యాంపులు తీసుకెళుతుంటారు.

*పి ఎం శ్రీ గా రూపు దాల్చిన మోడల్ స్కూల్*

పారదర్శక ఛాలెంజ్ పద్ధతి స్వారా ఇక్కడి మోడల్ స్కూల్ ఎంపికై పి ఎం శ్రీ పాఠశాలగా రూపుదిద్దుకొంటుంది. ఈ పాఠశాలను గుణాత్మకంగా బలోపేతం చేయటం, జాతీయ విధానాలతో ఆదర్శవంతమైన పాఠశాలగా మార్చడం, విద్యార్థులకు మౌలిక సదుపాయాలతో ఉత్సాహంగా, ఉత్పాదకంగా, నాణ్యమైన విద్యను అందించి సహాయకరంగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటం పి ఎం శ్రీ మోడల్ స్కూల్ ప్రధాన లక్ష్యం.

*మోడల్ స్కూల్ ప్రత్యేకాలు*

ర్యాంకులు తెచ్చే ఒకరిద్దరిపై మాత్రమే దృష్టి పెట్టకుండా ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధా శక్తిని కనబరుస్తూ, బట్టి ధోరణికి భిన్నంగా అర్ధవంతమైన విద్యాబోధనలో వెనుకబడిన విద్యార్థులకు సైతం ప్రత్యేక శిక్షణ అందిస్తారు. ఈ పాఠశాలలో విద్యనభ్యసించడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతంగా సువిశాల తరగతులను నిర్మించారు. ఎక్కడా ఇరుకు గదులుండవు. విద్యార్థులకు అనువుగా బెంచీలు, ఫ్యానులు ఏర్పాటై వున్నాయి. తరగతి గదుల గవాక్షముల గుండా ఏసీని తలతాన్నేలా ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యనందిస్తున్నారు.

విద్యార్ధులపై ఎలాంటి మానసిక వత్తడి పడకుండానే అవసరానికి ప్రత్యేక తరగతులను, సూపర్వైజ్డ్ స్టడీ అవర్స్, డిజిటల్ క్లాసులను నిర్వహిస్తారు.

వెనుకబడిన పిల్లలు స్కాలర్ షిప్పులు పొందడానికి ఎన్ . ఎం. ఎం. ఎస్ పరీక్షలకు అవసరమైన ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు. ఇన్ స్వైర్ – మనకే అవార్డులు, ఉత్తమ ఫలితాలతో లభించే ప్రతిభా అవార్డులను పొందడానికి శిక్షణ అందితారు.

*ప్రభుత్వ పథకాలు*

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే విద్యార్థులకు అందించే అన్ని పథకాలు ఇక్కడి మోడల్ స్కూలుకు వర్తిస్తుంది. 6 నుండి 10వ తరగతి వరకే కాకుండా ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు సైతం ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం అమలవుతుంది. మంచి నీటి సౌకర్యంగా ఆరో ప్లాంటు ఏర్పాటై వుంది. విద్యార్థులు క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడకుండా తగు జాగ్రర్త చర్యలు గైకొండానికి సి సి కెమెరాలు కూడా ఏర్పాటవున్నాయి.

అన్ని తరగతుల విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్సు, కిట్లు, ఉచిత దుస్తులు తదితర ప్రభుత్వ కానుకలు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అందిస్తారు.

*త్వరలో హాస్టల్ వసతి*.

ఇక్కడ చదివే విద్యార్థునులకు హాస్టల్ వసతిని త్వరలోనే కల్పించనున్నారు. హాస్టల్ నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి.

*చేతి రాత*

చేతి రాత మారితే నుదుటి రాత మారుతుంది అంటారు. ప్రతి ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఫ్రీ హ్యాండ్ స్పెషలిస్ట్ ఆహ్వానించి వారితో ప్రత్యేకంగా శిక్షణా తరగతులను నిర్వహిస్తారు. విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్స్, ఉత్తమ రాత రాయటం నేర్చుకొన్న వారికి ప్రముఖుల చేతులమీదుగా బహుమతులు అందిస్తారు.

ఇవి కాకుండా కో-కరికులం యాక్టివిటీసులను నిర్వహిస్తారు. ఎనర్జీ క్లబ్, మేథ్స్ క్లబ్, సోషల్ క్లబులను ఏర్పాటుచేస్తారు. వ్యాస రచన పోటీలు, వకృత్వ పోటీలు, చిత్ర లేఖనం పోటీలు, సమకాలీన అంశాలపై పట్టు పెంపొందించేందుకు క్విజ్ పోటీలను నిర్వహిస్తారు. ఈ పోటీ ప్రపంచంలో పరీక్షా సమయాల్లో పిల్లల్లో భయం పోగొట్టేలా … మానసిక వత్తిడిని తట్టుకునేలా మంచి ఫలితాలతో విజయం సాధించేలా… ప్రత్యేకంగా ప్రముఖులతో, నిష్ణాతులతో ప్రేరణ కలిగించేలా అవగాహనా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది.

*విశాల ఆటస్థలం*

ఇక్కడ తరగతి గదులు, లాబులు, పాథశాల భవనం తప్పించి విద్యార్థినీ విద్యార్థులు అన్ని రకాల ఆటలు ఆదుకొనేందుకు 5 ఎకరాల సువిశాల క్రీడా మైదానం వుంది. ఫుట్‌బాల్ కోర్టు, బాస్కెట్‌బాల్, బ్యాట్మింటన్ కోర్టులు ఏర్పాటై వున్నాయి. లాంగ్ జెంపు, హాయ్ జంపు, పరుగు పందెములలో శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేకమైన ఆటస్థలం ఏర్పాటుచేశారు. అన్ని రకాల క్రీడలకు అవసరమైన సామాగ్రి పనిముట్లు కలిగి వున్నాయి.

పీఎం శ్రీ స్కూలుగా మారటంతో ఇక్కడి క్రీడా మైదానంలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించ గలిగేంత అభివృద్ధి చెందుతుంది. ప్రతిరోజు పిల్లలను ఆడిస్తూ క్రెడల్లోనూ శిక్షణ ఇవ్వడానికి పీడీ మాస్టారు పనిచేస్తున్నారు.

*తల్లిదండ్రుల సమావేశం*

తల్లిదండ్రులు-ఉపాధ్యాయ సమావేశాలు విద్యా నిర్మాణంలో ఒక ముఖ్యమైన అంశం . తల్లిదండ్రులు-ఉపాధ్యాయ సమావేశాలు పాఠశాల జీవితంలో ఒక అంతర్భాగం. తల్లిదండ్రుల-ఉపాధ్యాయ సమావేశాలు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులతో క్రమశిక్షణ వ్యూహాలను చర్చించడానికి ఒక ఆదర్శవంతమైన అవకాశాన్ని అందిస్తాయి. ఇందుకోసం ఇక్కడ ప్రతి మూడు నెలలకొక సారి తల్లిదండ్రుల సమావేశం జరుగుతుంది.

పిల్లలు ఎలా చదువుతున్నారు. ప్రోగ్రస్ ఏమిటీ ?… పిల్లలు, ఉపాధ్యాయుల పనితీరు… పిల్లవాడు పాఠశాలలో ఏమి నేర్చుకుంటున్నాడో, పిల్లల ఫలితాలను, నడవడికలను, సామాజిక-భావోద్వేగ పురోగతిని అర్ధం చేసుకోవడానికి, లోపాలను సరిచేసుకోవడానికి ఉజ్వల భవిష్యత్తుకు ఈ సమావేశాలు దోహద పడేలా నిర్వహిస్తారు.

అలాగే పాఠశాల పిల్లల అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి కూడా తల్లుదండ్రుల కమిటీ సమావేశం జరిగేలా చర్యలు చేపట్టుతారు.

*విజ్ఞానం, వినోదం కోసం..*

పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు విజ్ఞానం, పరిజ్ఞానం, వినోదం అందించేలా.. విహాల యాత్రలు, పరిశ్రమలు, బాంకులు, పరిశోధనా, పర్యాటక కేంద్రాలు సందర్శించేలా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది.

ఇవి కాకుండా జాతీయ పండుగలు, భారతీయ సంస్కృతుల వేడుకలు, వార్షికోత్సవాలు, మ్యాథ్స్ డే, సైన్స్ డే, స్పోర్ట్స్ డే, చిల్డ్రన్స్ డే లాంటి కార్యక్రమాలన్నీ ఒక పండుగా పిల్లల్లో ఉత్తేజాన్ని కలిగిస్తూ నిర్వహిస్తారు. అలాగే స్వఛ్చ భారత్, స్వచ్ఛ పాఠశాల, వ్యాయామం, ధ్యానం, యోగా కార్యక్రమాలను నిర్వహిస్తారు.

విద్యార్థుల్లో మానసిక వత్తిళ్ళను తొలగించి ఆత్మ స్థైర్యం, ఆత్మా విశ్వాసం కలిగించేలా ప్రముఖ వైద్య నిపులతో కొన్సిలింగ్ ఇప్పిస్తారు. వైద్య బృందాలతో వివిధ రకాల వ్యాధుల పరీక్షలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తారు.

*ప్రత్యేకంగా వెబ్ సైటు*

ఇక్కడి మోడల్ స్కూల్ గురించి, ఇక్కడ  జరిగే కార్యక్రమాల గురించిపిల్లల ఫలితాల గురించిన ఎప్పటికప్పుడు పిల్లలకు, తల్లిదండ్రులకు అందరికీ అందుబాటులో ఉండేలా

ఈ పాఠశాల పరంగా..

 https://apmsvenkatagiri.com/     పేరుతో   ఒక వెబ్ సైటును ఏర్పాటై వుంది.

ప్రభుత్వ పరంగా.. 

https://schooledu.ap.gov.in/AP-CBSE-School/28193504214

పేరుతో  మరో  వెబ్ సైటును ఏర్పాటై వుంది. ఈ పాఠశాల గురించిన అభివృద్ధి, ఫలితాలు, అడ్మిషన్స్  గూర్చి ఈ వెబ్ సైటులలో తెలుసుకోవచ్చు

పాఠశాలకు సంబంధించిన సాంఘిక మాధ్యమాలు:
నేరుగా వాటి లింకులు

https://www.facebook.com/apms.venkatagiri

https://www.facebook.com/apmodelschool.venkatagiri

https://www.youtube.com/@apmodelschool.venkatagiri

https://www.youtube.com/@apms.venkatagiri

https://www.instagram.com/apms.venkatagiri

https://www.linkedin.com/in/ap-model-school-venkatagiri-4530a615b