ఆడపిల్లలు చైతన్యవంతులు కావాలి.
చదువుకొనే రోజుల నుంచే ఆడపిల్లలు చైతన్యవంతులు కావాలని,
ఆడవారికి అనేక చట్టాలున్నాయని వాటిని గుర్తించి సద్వినియోగం చేసుకోవాలని వెంకటగిరి జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి మరియు మండల న్యాయ సేవా సంస్థ చైర్ పర్సన్ జస్టిస్ ఓ. అనూష కోరారు. స్థానిక మోడల్ స్కూల్ లో గురువారం జరిగిన బాలల దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పిల్లల రక్షణకు, హింసలకు, దండనలు బాలల హక్కులు, దిశ లాంటి ఎన్నో ఉన్నాయని చెపుతూ ఆడపిల్లకున్న చట్టాల పట్ల అవగాహన కల్పిస్తూ మాట్లాడారు.

బాల దినోత్సవం సందర్బంగా వెంకటగిరి ఆదర్శ పాఠశాలలో బాలలకు వివిధ రకాల పోటీలు జరిగాయి. గెలుపొందిన విజేతలకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజరు ఆర్. వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ బ్యాంక్ మేనేజరు మనో రంజాన్ బేబి బహుమతులు అందజేశారు. సభకు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డి. తులసి జ్యోతి అధ్యక్షత వహించగా, ప్రముఖ న్యాయవాది డి. రాజా రావు, పేరెన్స్ కమిటీ చైర్మన్, సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
